Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫ‌స్ట్‌లుక్ రానేవ‌చ్చింది. మహేష్‌బాబు పుట్టిన‌రోజు సందర్భంగా చిత్రం బృందం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మహర్షి'గా నామకరణం చేశారు. ఈ చిత్రంలో మహేష్ రిషిగా ఓ కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. మహేష్‌బాబుకు జోడిగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. కేయూ మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ‌స్ట్‌లుక్‌కు ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలలో షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణ పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్రయత్నం చేస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: