ప్రముఖ కన్నడ నటి, 23 ఏళ్ళ వయసున్న అమూల్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కుమారుడు జగదీష్ ఆర్ చంద్రతో అమూల్య వివాహం రానున్న మే నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఘనంగా జరిగిన అమూల్య, చంద్ర నిశ్చితార్థం ఫోటోలును తన సహ నటులు హీరో గణేశ్, నటి హర్షిక లు సోషల్ మీడియాలో షేర్ చేసారు. 2001లో బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమూల్య ఇప్పటి వరకు 20కు పైగా కన్నడ చిత్రాల్లో నటించింది. కన్నడ ‘గోల్డెన్ గర్ల్’గా పేరు పొందిన అమూల్య ‘చైత్రదా చంద్రమా’, ‘నాను నన్న కనసు’, ‘శ్రావణి సుబ్రహ్మణ్య’, ‘గజకేసరి’ వంటి చిత్రాల్లో నటించింది. ‘శ్రావణి సుబ్రహ్మణ్య’ చిత్రంలో అమూల్య ప్రదర్శించిన అద్భుతమైన అభినయానికి గానూ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: