మరి కొన్ని...

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

యంగ్ హీరో అడివి శేష్ ‘గూఢచారి’ చిత్రంతో నటుడిగానే కాకుండా మంచి రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంటెన్సివ్ స్టోరీ తో అబ్బురపరిచే విజువల్స్ తో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రం సెన్సషనల్ హిట్ అయ్యింది. నూతన దర్శకుడు శశికిరణ్ టిక్కా తెరకెక్కించిన ఈ చిత్రంలో శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించగా సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఈ రోజు అడివి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు మొదలైనట్లు వెల్లడిస్తూ ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 2019 జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలుకానుందట. ఈ చిత్రాన్ని గూఢచారి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాహుల్ పాకాల తెరక్కించనున్నాడు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్టర్‌లో ‘గూఢచారి విల్‌ బీ బ్యాక్‌’ అని రాసుంది. ‘2’ అనే నెంబర్‌లో అడివి శేష్‌ను వెనక నుంచి చూపించారు. ఇందులో శ్యాంగా కీలక పాత్ర పోషించిన వెన్నెల కిశోర్‌ సీక్వెల్‌ గురించి స్పందిస్తూ..‘నేను కూడా ఇందులో భాగమైతే బాగుండు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఆగస్ట్‌లో విడుదలైన ‘గూఢచారి’ చిత్రాన్ని శశి కిరణ్‌ టిక్కా తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరించారు. శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌, మధు శాలిని, రవిప్రకాశ్‌, సుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ ఈ చిత్రాన్ని జేమ్స్‌ బాండ్‌ స్థాయినలో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

చిత్రం: పెళ్ళిరోజు
తారాగణం: దినేష్, నివేథా పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ తదితరులు
మాటలు: మల్లూరి వెంకట్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఛాయాగ్రహణం: గోకుల్ బెనోయ్
కూర్పు: సాబు జోసెఫ్
సమర్పణ: ప్రవీణ్ కందికట్టు
నిర్మాతలు: మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి
దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
బ్యానర్: సినీయోగ్ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ: 08 డిసెంబర్ 2018

ర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ‘ఒరు నాల్ కూతు‘ పేరుతో తమిళంలో రూపొందించిన చిత్రాన్ని ‘పెళ్లిరోజు‘ అనే టైటిల్ తో తెలుగులో అనువదించారు. దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ కందికట్టు సమర్పణలో మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలుసుకుందాం.

కథ:
పెళ్ళిరోజు కోసం ఎదురుచూసే ముగ్గురు అమ్మాయిల కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘పెళ్లిరోజు’. ఒక్కో అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కాలనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆ ముగ్గురి జీవితాల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలుపుతూ చివరికి వారి పెళ్లి తంతు ఎలా ముగిసిందనేది కాన్సెప్ట్.

ఒకే ఆఫీస్‌‌లో ఉద్యోగం చేస్తున్న కావ్య (నివేథా పేతు రాజు), రాజ్ (దినేష్) ప్రేమలో పడతారు. అమ్మాయి ధైర్యంగా తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెబుతుంది. ఈ తరుణంలో రాజ్‌‌ను తన తండ్రికి పరిచయం చేయాలని మొదట్లో ఒకట్రెండుసార్లు కావ్య ప్రయత్నాలు చేసినప్పటికీ అసలు అక్కడికెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేదాన్ని ముందుగానే ఊహించుకుని రాజ్‌‌ వెళ్లడానికి సాహసించడు. ఈ లోగా కావ్య ఫాదర్, పేదవాడైన రాజ్ ను అంగీకరించక కావ్యకు వేరే సంబంధం చూస్తాడు. తప్పని పరిస్థితిలో ఆ పెళ్లిని అంగీకరిస్తుంది కావ్య. అయితే ఆ పెళ్ళి జరిగిందా..?

ఇక రెండో అమ్మాయి లక్ష్మీ(మియా జార్జ్). ఆమె తోబుట్టువులిద్దరికీ పెళ్లిళ్లు అయిపోతాయి. లక్ష్మీకి మాత్రం మంచి ఉద్యోగం ఉండేవాడికిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి (నాగినీడు) వెతకటం మొదలుపెడతారు. ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోతాయి. తండ్రి చాటు పెరిగిన అమ్మాయి కావడంతో ఎదిరించలేక తానూ కూడా పెళ్లి చూపులకు సిద్దపడుతూనే ఉంటుంది. ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి లక్ష్మి అమితంగా నచ్చడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి వాళ్ళ ప్రయత్నం నెరవేరిందా..?

ఇక మూడో అమ్మాయి సుశీల (రిత్విక) రేడియో జాకీ గా పని చేస్తుంటుంది. పెళ్లి కోసం చాన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పోతుంటాయి. ఈ క్రమంలోనే ఓ సంబంధం ఖాయం అవుతుంది. మొదట ఆ పెళ్ళికి ఒకే చెప్పినా నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని సుశీలకు చెబుతాడు పెళ్ళికొడుకు. షాక్ తిన్న సుశీల ఎలాగైనా అతనిని పెళ్లికి ఒప్పించమని ఆమె అన్నయ్యను అడుగుతుంది. సుశీల అన్నయ్య, అతని స్నేహితుడు (చార్లీ) నచ్చచెప్పడంతో పెళ్ళికొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఇలా ఈ ముగ్గురి పెళ్ళిళ్ళకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి..? ఆ ముగ్గురు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నదే 'పెళ్లిరోజు' క్లైమాక్స్.

నటన:
కథా ప్రాధాన్యమున్న చిత్రం కాబట్టి నటులకన్నా పాత్రలే మనకి కనబడతాయి. 'కబాలి' చిత్రంలో రజనీకాంత్ బాడీగార్డ్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ ఈ చిత్రం లో రాజ్ పాత్రను చేసి మెప్పించాడు. ‘మెంటల్ మదిలో’ చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నివేథా పేతురాజ్ కావ్య పాత్రలో చక్కగా మెప్పించింది. సునీల్ సరసన ‘ఉంగరాల రాంబాబు’ లో నటించిన మియా జార్జ్ లక్ష్మి పాత్రలో చాలా అమాయకురాలిగా, అందంగా కనిపిస్తుంది. తమిళ ‘బిగ్ బాస్ 2’ విజేత రిత్విక సుశీల పాత్రలో ఒదిగిపోయింది. ఇక మధ్య మధ్యలో హీరో ఫ్రెండ్‌‌ పాత్ర పోషించిన బాల శరవణన్, ఆర్జే పాత్రలో రమేశ్ తిలక్ టైమింగ్‌‌ను బట్టి కామెడీ బాగా పండించారు. ఇలా ఎవరికీ వారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికత:
దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ సార్వజనీన కాన్సెప్ట్ ను తెరకెక్కించాడని చెప్పొచ్చు. కథా కథనాలు మన పక్కింటి వాళ్ళ జీవితాలను చూసి రాసుకున్నాడా అనిపించేలా చాలా సహజంగా అనిపిస్తాయి. సీరియస్ కథను ఎంచుకోవడమే కాకుండా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అత్యంత సహజంగా చిత్రీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎవరి కథ ఎలా మలుపు తిరుగుతుందో క్లైమాక్స్ లో చాలా చక్కగా చూపించాడు. అమ్మాయిల ఆలోచనలను వారికున్న సహనాన్ని కన్నులకు కట్టినట్టుగా, అర్థవంతంగా చూపించాడు. తమిళంలో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగులో కూడా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని ‘చిలకా చిలకా’ పాట ఇప్పటికే మంచి హిట్. సోషల్ మీడియా సెన్సేషన్ పల్లె కోయిల ‘పసల బేబి’ ఈ చిత్రంలో 'ఏంటే ఏంటే' పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి అందించిన మల్లూరి వెంకట్ మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ, సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్న సంగతి ప్రేక్షకులకి ఎక్కడా అనిపించకుండా.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలా చిత్రబృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

చివరికేమిటి:
ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా యువతీ యువకుల మనస్తత్వాలకు, భావాలకు అద్దం పట్టిన చక్కటి చిత్రం 'పెళ్లిరోజు'. 

రేటింగ్: 3.5/5
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

లంతర్గామి నేపథ్యంలో ‘ఘాజీ’ని తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి ఈ సారి అంతరిక్షం, స్పేస్‌ సెంటర్‌ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం: 9000 kmph’. వరుణ్‌తేజ్‌, అదితీరావ్‌ హైదరీ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. ‘ప్రపంచం మొత్తం కమ్యునికేషన్‌ బ్లాక్‌ అవుట్‌ అయ్యే అవకాశం ఉంది’ అని ఓ వ్యక్తి అంటే.. ‘దయచేసి ఒక్క శుభవార్త చెప్పు భాను..’ అని మరొకరు ఆయన్ను అడిగారు. ‘ఒకటి ఉంది సర్‌.. దేవ్‌.. పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో శాటిలైట్స్‌కు సక్సెస్‌ఫుల్‌గా కోడింగ్‌ చేశాడు’ అంటూ వరుణ్‌తేజ్‌ను పరిచయం చేశారు. సస్పెన్స్‌తోపాటు ప్రేమకథను కూడా ఇందులో చూపించారు. ‘ఈ శాటిలైట్‌ ఓ సోల్జర్‌ లాంటిది. ఫైయిల్‌ అయితే ఎలా అని అడగకూడదు. గెలవాలంటే ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించాలి’ అని హీరో చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.


ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై.రాజివ్‌రెడ్డి, కె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి సమర్పిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

ట్టకేలకు సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్‌4’ ట్రైలర్‌ వచ్చేసింది. అంతేకాదు, సినిమా టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ అనే టైటిల్‌ను పెట్టారు. ముందస్తు సమాచారం లేకుండా మార్వెల్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేసి ‘అవెంజర్స్‌’ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ చివరిలో పలువురు అవెంజర్స్‌ మాయమవుతూ కనిపించారు. అసలు వాళ్లెక్కడికి వెళ్లారు? బతికే ఉన్నారా? ప్రపంచాన్ని నాశనం చేసి, తన సామ్రాజాన్ని సృష్టించాలనుకున్న థానోస్‌ ఏం చేయబోతున్నాడు? అతన్ని అవెంజర్స్‌ ఎలా మట్టుబెట్టబోతున్నారు? వంటి ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది.

‘హే పెప్పా.. నీకీ రికార్డింగ్‌ అందే సమయానికి నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. స్పేస్‌లో కొట్టుకుపోతూ ఎవరైనా రక్షిస్తారనే ఆశతో స్పేస్‌లోనే చావడం నా అదృష్టం అనుకోవాలి. నిజానికి నాలుగు రోజుల క్రితమే ఆహారం నీళ్లు అయిపోయాయి. రేపటికల్లా ఆక్సిజన్‌ కూడా అయిపోయింది. చావు బతుకుల మధ్యే ఉన్నా నీ పేరే కలవరిస్తున్నా.. నీ గురించే ఆలోచిస్తున్నా’ అంటూ ఐరన్‌మ్యాన్‌ టోనీ స్టార్క్‌ సంభాషణతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది.


‘థానోస్‌ అన్నంత పనీ చేశాడు. 50శాతం ప్రాణులను తుడిచిపెట్టేశాడు’ అని బ్లాక్‌ విడో అంటే ‘మనం గెలుస్తాం! అది పనిచేయకపోతే ఏం చేయాలో తెలియదు.’ అని కెప్టెన్‌ అమెరికా చెప్పడం, బయట నుంచి యాంట్‌మ్యాన్‌ వారిని పిలవడంతో ట్రైలర్‌ ముగిసింది. ఆంటోని రుస్సో, జాయ్‌ రుస్సోలు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా...ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 28కోట్లకు పైగా వ్యూస్ సాధించి చరిత్రలోనే అత్యధికమంది వీక్షించిన ట్రైలర్‌గా నిలిచినట్లు మార్వెల్ స్టూడియోస్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.

మిళ నటుడు విమల్‌, ఆష్నాజవేరి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇవనుక్కు ఎంగయో మచ్చం ఇరుక్కు’. శుక్రవారం ఈ చిత్రం తెరపైకి వస్తోంది. తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో కలిపి దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదలవుతున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలే కేరళలో వందకు పైగా థియేటర్లలో వస్తుంటాయి. తొలిసారిగా విమల్‌ చిత్రం కూడా ఆ స్థాయి థియేటర్లలో విడుదలవుతుండటం విశేషం. ఈ సినిమాకి నటరాజన్‌ శంకరన్‌ సంగీతం సమకూర్చారు.

సినిమా గురించి దర్శకుడు ఏఆర్‌ ముఖేష్‌ మాట్లాడుతూ.. ‘‘గ్లామర్‌, హాస్యం కలగలసిన కథాంశంతో ఈ సినిమాను రూపొందించాం. మొత్తం 50 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశాం. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రం ఉంటుందని నమ్ముతున్నాం. విమల్‌కు కూడా బ్రేక్‌నిచ్చే సినిమాగా నిలుస్తుందని’’ పేర్కొన్నారు. విమల్‌ మాట్లాడుతూ.. కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదన్నారు. ప్రేమికులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని పేర్కొన్నారు.
Latest news on Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, English cinema and Tollywood, Kollywood, Sandalwood, Mollywood, Bollywood, Hollywood movies.


తెలుగు సినిమా స్క్రీన్ ప్లే

సినిమా స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం విలువని గుర్తించకపోతే చాలా నష్టం కథకి. నూటికి 90 శాతం మంది ఇది తెలుసుకోకుండానే రాసేస్తున్నారు. స్క్రీన్ ప్లేకి బిగినింగ్ ముఖ చిత్రమైతే మిడిల్ దేహం. దేహం లేకుండా, ఒకవేళ వున్నా సగానికి కుదించి, ఇంకా ఆ సగంలో సగానికి కూడా కుదించి రాసే స్క్రీన్ ప్లేలు నిజానికి స్క్రీన్ ప్లేలు కావు. స్క్రీన్ ప్లేలో సగ భాగం అంటే 50 శాతం నిడివితో మిడిల్ విభాగం వుంటే అది ఉత్తమ స్ట్రక్చర్. 25 శాతం వుంటే బలహీన స్ట్రక్చర్, 25 శాతం కన్నా తక్కువ వుంటే అది స్క్రీన్ ప్లేనే కాదు. మిడిల్ విభాగం బిజినెస్ లోకి వెళ్ళే ముందు మిడిల్ భౌతిక స్వరూపం గురించి లోతుగా తెలుసుకోవడం అవసరం. ఓ రెండు గంటల స్క్రీన్ ప్లే వుందంటే అందులో అరగంట సేపు బిగినింగ్, ఓ గంటసేపు మిడిల్, ఇంకో అరగంట సేపూ ఎండ్ విభాగాలుండాలన్న మాట - శాతాల్లో చూస్తే స్ట్రక్చర్ 25%- 50%- 25% గా ఉండాలన్న మాట. అంటే 1 : 2 : 3 నిష్పత్తులన్న మాట. ఎటొచ్చీ మిడిల్ అనేది బిగినింగ్, ఎండ్ విభాగాల కంటే రెట్టింపు సైజులో ఉండాలన్న మాట.

ఎందుకు రెట్టింపు సైజులో వుండాలి? అసలు కథంతా ఇక్కడే వుంటుంది కాబట్టి. బిగింగ్ అనేది కథకాదు. అది కథని పరిచయం చేసే ప్రవేశ ద్వారం మాత్రమే. అలాగే ఎండ్ కూడా కథ కాదు. అది కథకి ముగింపు పలికే నిష్క్రమణ మార్గం మాత్రమే. మిడిల్ లో వున్న కథని పరిచయం చేసేది బిగినింగ్ అయితే, మిడిల్లో నడిచిన కథకి ముగింపుకి తెచ్చేది ఎండ్. ఎక్కడైతే కథా పరిచయ విభాగం ‘బిగినింగ్’ అనేది ముగింపు కొస్తూ సమస్యని ఏర్పాటు చేస్తుందో, ఆ బిందువుని ప్లాట్ పాయింట్ -1 అంటున్నాం. ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర నుంచీ ప్రారంభమయ్యేది మిడిల్. ఇది ఇంటర్వెల్ మీదుగా కొనసాగి అవతల ప్లాట్ పాయిట్ -2 అనే మరో బిందువు దగ్గర అంతమవుతుంది. ఈ బిందువు ప్లాట్ పాయిట్ - 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యకి పరిష్కార మార్గాన్ని సూచించే బిందువు. అంటే బిగినింగ్ అందించే సమస్యని తీసుకుని మిడిల్ తనదైన బిజినెస్ తో సాధించి ఓ పరిష్కారమార్గాన్ని కనుగొని ఎండ్ కి అందిస్తుందన్న మాట. బిగినింగ్ అందించే సమస్యని పరిష్కరిస్తూ ఎండ్ కి అందించడం మిడిల్ నిర్వర్తించే కార్యకలాపమన్న మాట. పిండి మర నోటి దగ్గర గోధుమలు పోస్తే, ఆ మర గోధుమల్ని ఆడించి పిండిగా మార్చి బయటికి ఎలా పంపుతుందో, స్క్రీన్ ప్లేలో మిడిల్ చేసే పని కూడా ఇలాటిదే : తన నోటికి బిగినింగ్ అందించే సమస్యని మరాడించి, పరిష్కార మార్గాన్ని ఎండ్ కి అందించడం.

మరలో గోధుమలు ఎంతసేపు పోస్తారు? అది క్షణాల్లో పని. ఆ గోధుమలు పిండిగా మారడానికి నిమిషాలు పడుతుంది. చివరికి బయటికి రావడం మళ్ళీ క్షణాల్లో పనే. అలాగే స్క్రీన్ ప్లే ప్రారంభంలో బిగినింగ్ విభాగం మిడిల్ విభాగానికి సమస్యని అందించడం అంత చప్పున జరగాలి. ఆ సమస్యని మిడిల్ మరాడించడానికి ఎంత సమయమైనా తీసుకోవచ్చు. సమస్యని అందించడానికే బిగినింగ్ చాలా సమయం తీసుకుంటే, మరాడించడానికి మిడిల్ కి చాలినంత సమయం దొరకదు. ఎందుకంటే దాని టైము ప్రకారం అది అవతల ఎండ్ కి పరిష్కారం అందించాలి.

ఎండ్ సమయాన్ని తను తినేయ్యడానికి లేదు. ఎంత మిడిల్ సమయాన్ని బిగినింగ్ తినేసి పంక్చువాలిటీ లేకుండా ప్రవర్తించినా, మిడిల్ మాత్రం ఎండ్ తో పంక్చువాలిటీ తోనే వుంటుంది. మిడిల్ మరాదించే సమయాన్ని బిగినింగ్ సమస్యని అందించడానికి తాత్సారం చేస్తూ ఎంత తినేస్తే అంత మిడిల్ సమయం తగ్గి- ఆ మేరకు కథ కూడా తగ్గిపోతుంది...

కథంటే మిడిలే!
ఈ కింది పటం చూడండి:

ఇందులో బిగినింగే ఇంటర్వెల్ వరకూ సాగుతోంది. భారతీయ సినిమాల్లో సర్వసాధారణంగా వుండే స్ట్రక్చర్ ఇది. రెండు గంటల సినిమా వుందంటే సమస్యని స్థాపించడానికి ఇంటర్వెల్ వరకూ గంట సేపు సమయం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సమస్య స్థాపించే వరకూ కథ ప్రారంభమేకావడం జరగదని ప్రధానంగా గమనించాలి. రెండు గంటల సినిమాలో సగభాగం సమయం, అంటే స్క్రీన్ ప్లే లో 50% నిడివి అంతా ఇలా 25 % ఉండాల్సిన బిగినింగే తీసుకుంటే అంకాలు స్థానభ్రంశం చెందినట్టే. మొదటి అంకం అంటే బిగినింగ్ వెళ్లి- రెండో అంకం మిడిల్ లోకి జొరబడి ఇంటర్వెల్ వరకూ చోటుని ఆక్రమిస్తే, మిడిల్ వెళ్లి ఇంటర్వెల్ తర్వాత సర్దుకుంటోంది పై పటంలో. దీంతో ఫస్టాఫ్ లో ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ కొచ్చి 50% ఉండాల్సిన మిడిల్ సైజు, ఇంటర్వెల్ తర్వాత మాత్రమే సగానికి, అంటే 25 % కుంచించుకు పోతోంది. ఐదవ తరగతి చదివే కుర్రాడు ఐదవ తరగతి లోనే కూర్చోవాలి. వాడు వెళ్లి ఆరో తరగతిలో జొరబడితే అక్కడ కలకలం రేగుతుంది. వాడు ఇరికిరికి కూర్చునే సరికి ఆరో తరగతి కుర్రాళ్ళు కూడా వాడికి చోటు వదిలి తామూ ఇరికిరికి కూర్చోవాల్సి వస్తుంది. తిక్కరేగితే వాణ్ణి తన్ని వెళ్ళగొట్టవచ్చు. కానీ మిడిల్ చోటుని దర్జాగా కబ్జా చేసే బిగినింగ్ ని మెడబట్టి గెంటేసేందుకు మనసొప్పదు భారతీయ స్క్రీన్ ప్లే కళాకారులకి. తమ సొమ్మేం పోయింది- కొంప లంటుకునేది నిర్మాతలకే కదా. వెరసి మెజారిటీ భారతీయ సినిమాల స్క్రీన్ ప్లే స్ట్రక్చర్= 50% బిగినింగ్, 25% మిడిల్, 25% ఎండ్ = 2 : 1 : 1 = బిగినింగ్ గంట + మిడిల్ అరగంట + ఎండ్ అరగంట = ఫస్టాఫ్/సెకండాఫ్ స్క్రీన్ ప్లే మోడల్ అన్నమాట!

బిగినింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్సు. ఆ బిగినింగ్ సాగే ఇంటర్వెల్ వరకూ కథ వుండదు మళ్ళీ. కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్, పాటల కార్యక్రమం వీటితోనే గడిచిపోయి- ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడో పాయింటు తో సమస్యా స్థాపన. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లోనే మిడిల్ ప్రారంభం. అంటే ఇక్కడే కథ ప్రారంభమవుతుంది ఇంటర్వెల్లో ఏర్పాటు చేసిన ఆ సమస్యని పట్టుకుని. సెకండాఫ్ లో వుండే ఆ గంట సమయంలోనే మిడిల్ నీ, ఎండ్ నీ సర్దాలి కాబట్టి- మిడిల్ కోఅరగంట, ఎండ్ కో అరగంటా దక్కుతాయి. ఎండ్ కి ఇబ్బంది లేదు. దాని సైజు మారదు. ఇలా మొత్తం రెండు గంటల నిడివిగల సినిమాలో కథ ( మిడిల్) నడిచేది అరగంట సేపే నన్న మాట. అరగంట కథ కోసం గంటన్నర సినిమా భరించాలి ప్రేక్షకులు. ఇదొక శ్రమ తప్పించుకునే స్కామ్ కాకపోతే ఏమిటి?

ఇంతేనా? ఇంకో పెద్ద స్కామ్ కూడా వుంది. స్క్రీన్ ప్లే రైటింగ్ పేరుతో జరుగుతున్న అతి పెద్ద స్కామ్ లో అసలు శ్రమించడమే వుండదు. పై రెండో పటం చూస్తే ఇదేమిటో తెలుస్తుంది. ఈ స్కామ్ దెబ్బకి ఏ సినిమా కూడా ఒక్క పూట ఆడే ప్రసక్తే లేదు. ‘అఖిల్’ అయినా సరే, ‘కిక్-2’ అయినా సరే. మిడిల్ ని గౌరవించక పోతే ఆ మిడిల్ నిర్మాతల్ని లెక్క చెయ్యదు. ఈ పటంలో మిడిల్ ని కూడా మింగేస్తూ బిగినింగే ఎండ్ దాకా సాగుతోంది.. ఎప్పుడో ఫస్టాఫ్ లోనే ప్రారంభమై ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లోకి ఎంటరై 50% ఉండాల్సిన మిడిల్, ఇక్కడ 12.5% శాతానికి చిక్కిశల్యమై, వెళ్ళేసి ఎండ్ విభాగపు చోటులో ఇరుక్కుంటోంది. ఎండ్ కూడా 12.5% శాతానికి చిక్కిపోతోంది. అంటే ఇలా క్లైమాక్స్ దగ్గర మాత్రమే ప్రారంభమయ్యే కథ, అప్పుడే మొదలై అప్పుడే ముగిసిపోయే అగత్య మన్నమాట. ఈ కింది పటంలో కూడా చూడండి మిడిల్ పరిస్థితి. అందుకే మిడిలే (కథే) వుండని ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే!

ఇలా జరగడానికి సినిమా మొత్తంగా నడిచేది కథే అనే దురభిప్రాయంతో ఉండడమే కారణం. సినిమా మొత్తం నడిచేది కథే కాదు, మిడిల్ లో వుండేది మాత్రమే అసలు కథ, ప్రాణం, బలిమి, సింహాసనం, కథాపాలనా వగైరా. బిగినింగ్ లో వుండేది కేవలం ఉపోద్ఘాతమేననీ, అలాగే ఎండ్ లో వుండేది కూడా కేవలం ఉపసంహారమేననీ సాంకేతిక దృక్కోణంలో స్క్రీన్ ప్లే ని చూడకపోతే మిగిలేది రోదనే.

ప్రేక్షకుల సమయం విలువైనది. ఆ విలువైన సమయాన్ని సమాదరిస్తే వాళ్ళుకూడా సినిమాని ఆదరించే అవకాశం వుంటుంది. కథ చెప్పాలనుకుంటే చప్పున ఫస్టాఫ్ లోనే ప్రారంభించాలి మిడిల్ ని. ఉపోద్ఘాతాల చాపల్యం, ఉపసంహారాల ప్రకోపం అదుపులో వుంచుకోవాలి. కింద చూపిన పటాల్లో విధంగా కథని సకాలంలో ప్రారంభిస్తే స్ట్రక్చర్ అర్ధవంతంగా వుంటుంది:

ఈ సార్వజనీన, ప్రామాణిక త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వున్న ‘దేవదాసు’ ని చూస్తారా, ‘పాండురంగ మహాత్మ్యం’ ని చూస్తారా, ‘అల్లూరి సీతారామరాజు’ ని చూస్తారా- ఇంకా వందల్లోవున్న- ఆనాటి ఎన్నో సినిమాల్ని చూస్తారా మీ ఇష్టం. ఏమైపోయింది ఆనాటి నమ్మక మైన స్ట్రక్చర్? ఏమైపోయింది మిడిల్ కి అంతటి గౌరవం? ఫస్టాఫ్/సెకండాఫ్ స్ట్రక్చర్ తో మిడిల్ విలువని తగ్గించింది గాక, అసలు మిడిలే వుండని మిడిల్ మటాష్ స్ట్రక్చర్ అనే కొత్త వైకల్యాన్ని ఎందుకు సంతరించుకుని భారీ సినిమాల్ని సైతం మట్టి కరిపించుకునే దాకా వచ్చింది?
(ఇంకా ఉంది) 

—సికిందర్