విభిన్న కథలు, నేపథ్యాలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సినిమాలకే అత్యధికంగా ఆస్కార్లు వరిస్తుంటాయి. ఇప్పుడు వాటితో పాటు బాక్సాఫీసు వద్ద అత్యంత ఆదరణ దక్కించుకున్న సినిమా కూడా ఆస్కార్ దక్కించుకొనే అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని బుధవారం ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. ప్రజల్లో బాగా పాపులర్ (అత్యధికంగా ప్రజాదరణ పొందిన) అయిన సినిమా ఆస్కార్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చు.
అయితే ఈ పాపులర్ కేటగిరీలో పోటీ పడాలంటే సినిమాకు ఉండాల్సిన అర్హతలు, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందో అకాడమీ ఇంకా వెల్లడించలేదు. బాక్సాఫీసును కళకళలాడించిన సినిమాలకు ఈ అవార్డు వరిస్తుందన్నది సంస్థ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. గత సంవత్సరం ఉత్తమ చిత్రంగా నిలిచి ఆస్కార్‌ను సొంతం చేసుకున్న ‘ది షేప్ ఆఫ్ వాటర్’ దేశీయంగా 63 మిలియన్ డాలర్లు సంపాదించి బాక్సాఫీసు ర్యాంకింగుల్లో 10 స్థానంలో నిలిచిందని బాక్సాఫీసు మోజో వెల్లడించింది. అత్యధికంగా వీక్షకులను ఆకర్షించే ఉద్దేశంతో ఈ విభాగంలో అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Post A Comment: