ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలోనే గాక భారతీయ చిత్ర రంగంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రాజమౌళి రూపొందించిన అద్భుతం ‘బాహుబలి-2’ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయం ముందు ఆ తర్వాత విడుదలైన బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా నిలవలేకపోయాయి. కనీసం 'బాహుబలి' హిందీ వెర్షన్ సెట్ చేసిన టార్గెట్‌ను కూడా అందుకోలేకపోయాయి. దీంతో అక్కడి పెద్ద నిర్మాతలు, హీరోలు, దర్శకుల్లో బాహుబలిని మించిన సినిమా తీయాలనే తపన మొదలైంది.
ఇప్పుడు ఆ తపనే ప్రయత్న రూపం దాల్చి ‘తానాజీ’ గా రూపుదిద్దుకుంటోందనే టాక్ బీ టౌన్ లో వినబడుతోంది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారట. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా చర్చే. అందరూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 'బాహుబలి' స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఈ మాటలు ఎంతవరకు నిజమవుతాయో, మరో 'బాహుబలి' అవుతుందో లేదో వేచి చూడాలి.
Post A Comment: