కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా ‘వైరం’ చిత్రం శుక్రవారం (24 ఆగస్టు 2018) రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సాయి శివన్.జె దర్శకత్వంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున పిక్చర్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో జె.ఎం.కె నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి దర్శకుడు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీవాస్ గౌరవ దర్శకత్వం వహించారు. కాశీ విశ్వనాథ్, గోపీనాథ్ స్క్రిప్టుని అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవరాజ్ మాట్లాడుతూ ‘‘తెలుగు, కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించి నంది అవార్డు అందుకున్నా. మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తున్నా. నాపై చూపిన అభిమానాన్ని తనపైనా చూపిస్తారని ఆశిస్తున్నా. మా అబ్బాయి కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతోపాటు పక్కా యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. హీరోకి యాప్ట్ అయ్యే కథ ఇది. కథానాయకుడు ప్రేమ కోసం ఎవరితో, ఎలా పోరాటం చేశాడనేది తెరపైనే చూడాలి. ఐదు పాటలు, ఏడు యాక్షన్ ఘట్టాలుంటాయి. మహతి సాగర్ వినసొంపైన స్వరాల్ని అందించారు. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తాం’’ అని అన్నారు.
హీరో ప్రణమ్ దేవరాజ్ మాట్లాడుతూ ‘‘కన్నడంలో ‘కుమారి 21ఎఫ్’ కన్నడ రీమేక్‌లో నటించా. ఆ చిత్రం హిట్ అయ్యి నన్ను హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు ‘యాక్షన్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి శాయశక్తులా కృషి చేస్తా.’’ అని చెప్పారు.
‘‘సెప్టెంబర్ మొదటి మొదటివారం నుంచీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హైదరాబాద్, కర్ణాటక, బెంగుళూరు ప్రాంతాల్లో ఎక్కువశాతం చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత జె.ఎం.కె అన్నారు. ఈ కార్యక్రమంలో విన్ను మద్దిపాటి, స్వప్న, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర, ఛాయాగ్రాహకుడు గోపీనాధ్.సి పాల్గొన్నారు.
Post A Comment: