ప్రముఖ మలయాళ దర్శకుడు దీపన్ కన్నుమూశారు. కొన్నాళ్ళుగా కాలేయ, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (మార్చి 13) ఉదయం తుది శ్వాస విడిచారు. మలయాళంలో ఈయన 'లీడర్', 'పుతియ ముఖం', 'హీరో', 'సిమ్' వంటి సూపర్ హిట్ సినిమాలతో కలిపి మొత్తం 6 చిత్రాలను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జయరామ్, రోమా అస్రాని లు జంటగా రూపొందిస్తున్న ‘సత్య’ అనే చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.

దీపన్ హఠాన్మరణానికి దిగ్భ్రాంతి చెందిన పలువురు మలయాళ సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. రేపు ఉదయం త్రివేండ్రంలో దీపన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: