
అల్లరి నరేష్, నిఖిలా విమల్ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న ‘మేడమీద అబ్బాయి’ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఒరు వడక్కం సెల్ఫీ' చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి. ప్రజిత్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నివ్వగా, నూజివీడు సీడ్స్ వైస్ ఛైర్మన్ రామకోటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్, టి.ప్రసన్నకుమార్ చిత్రబృందానికి స్క్రిప్టుని అందజేశారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘‘నేను చేస్తున్న 53వ చిత్రమిది. మలయాళంలో విజయం సాధించిన ‘ఒరు వడక్కం సెల్ఫీ’కి రీమేక్‌గా రూపొందుతోంది. మాతృకని తీసిన దర్శకుడే తెలుగులోనూ తెరకెక్కిస్తుండడం ఆనందంగా ఉంది. ఇదివరకు నేను చేసిన ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ తరహాలో కథా బలమున్న ఓ మంచి చిత్రంగా తెరకెక్కుతోంది. కామెడీతో పాటు, థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. నా కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది.’’ అని అన్నారు. చిత్ర హీరోయిన్ నిఖిలా విమల్ మాట్లాడుతూ ‘‘ఒక విజయవంతమైన కథతో తెలుగులో పరిచయమవుతుండడం ఆనందంగా ఉంది. ఇదివరకు తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటించాను.’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘అల్లరి నరేష్‌ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. మా అందరికీ ఎంతో ఇష్టమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 16 నుంచి కేరళలోని పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం.’’ అన్నారు.
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్, ఛాయాగ్రహణం: ఉన్ని ఎస్.కుమార్, కళ: రాజీవ్ నాయర్, కూర్పు: నందమూరి హరి
Post A Comment: