Tamil Cinema '2.0' news | Rajinikanth and Akshay Kumar in Robo 2 | Shankar's movie '2.0' | '2.0' movie satellite rights | Super Star Rajini in '2.0' movie

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడుగా శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘2.0’ చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల శాటిలైట్‌ ప్రసార హక్కులు రూ.110 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ టీవీ ఛానెల్ జీ టివి ఈ హక్కులను పొందినట్ట్లు చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు మహాలింగం ట్విట్టర్ ద్వారా తెలిపారు. 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తవగా ఇంకాస్త ప్యాచ్ వర్క్, ఒక పాట మాత్రమే మిగిలున్నాయి.
అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. నిర్వ సాహా సినిమాటోగ్రఫీని, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ‘2.0’ చిత్రం టీజర్‌ విడుదల కానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: