తెలుగు సినీ ప్రియుల జ్ఞాపకాల నుంచి ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: కన్‌క్లూజన్‌’... సినిమాలు ఇంకా చెదిరిపోలేదు. ఆ సినిమాల గురించీ, రికార్డుల గురించీ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ‘బాహుబలి’ బ్రాండింగ్‌ కూడా అలానే కొనసాగుతోంది. ‘బాహుబలి’ పాత్రల్ని గుర్తు చేస్తూ బొమ్మలు, వీడియో గేములూ రూపొందాయి. పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’కి ఓ విధంగా ఇది ప్రీక్వెల్‌ అన్నమాట.

ఆనంద్‌ నీలకంఠన్‌ అనే రచయిత ‘బాహుబలి’కి ముందు ఏం జరిగిందో ఊహిస్తూ, ‘ది రైజింగ్‌ ఆఫ్‌ శివగామి’ అనే పుస్తకం రచించారు. దాని ఆధారంగానే ఈ వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళితో సహా దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారు ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తారు. బాహుబలి, కట్టప్ప, శివగామి, బిజ్జల దేవ, భళ్లాలదేవ... ఈ పాత్రల గురించి మరింత క్షుణ్ణంగా నెట్‌ఫ్లిక్స్ లో రాబోయే ఈ వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నారు.

ఏడాది నుంచి ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా, 'బాహుబలి' స్థాయిని గుర్తు తెచ్చేలా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: