Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

నుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తాప్సి, రిషి కపూర్‌, ప్రతీక్‌ బబ్బర్‌, అశుతోష్‌ రాణా ప్రధాన పాత్రల్లో బనారస్‌ మీడియా వర్క్స్‌, సోహమ్‌ రాక్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన సినిమా ‘ముల్క్‌’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అయితే ఈ సినిమాను పాకిస్థాన్‌లో నిషేధించారు. ఈ విషయాన్ని దర్శకుడు అనుభవ్‌ తెలిపారు. అక్కడి సెన్సార్‌ బోర్డు సినిమాను నిషేధించిందని పేర్కొంటూ ఏ దర్శకుడూ ఇవ్వని సలహా కూడా ఇచ్చారు. సినిమాను పైరసీ డౌన్‌లోడ్‌ చేసుకుని చూడమని పాకిస్థాన్‌ ప్రేక్షకులకు సలహా ఇచ్చారు.

ఈ మేరకు ‘ప్రియమైన పాకిస్థాన్‌ ప్రజలకు’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు. ‘తాజాగా నేను ‘ముల్క్‌’ అనే సినిమాను తీశాను. అనుకోకుండా మీ దేశంలోని సెన్సార్‌ బోర్డు నా చిత్రాన్ని చూడకుండా నిషేధించింది. మీ అందరికీ నా విన్నపం.. ఇప్పుడున్న పరిస్థితుల్ని మీరు చూడకూడదనే సినిమాను నిషేధించారు. నాకు తెలుసు.. మీరు త్వరలో, భవిష్యత్తులో ఈ సినిమాను చూస్తారని. దయచేసి సినిమాను చూసి, పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు ఎందుకు సినిమాను నిషేధించిందో నాకు చెప్పండి. మీరంతా లీగల్‌గా సినిమా చూడాలని నాకూ ఉంది. కానీ కుదరని పక్షంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఇంట్లో కూర్చుని‌ అనధికారంగానైనా చూడండి. మరోపక్క మా బృందం పైరసీని ఆపడానికి కష్టపడుతోంది’ అని అనుభవ్‌ పేర్కొన్నారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: