Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

ప్రేమ కథలను అందమైన కావ్యాలుగా, స్టైలిష్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు గౌతంమేనన్‌ దిట్ట. ఎంతో మందిని స్టైలిష్‌ హీరోలుగా మార్చిన గౌతంమేనన్‌ త్వరలోనే తెరపై కథానాయకుడిగా కనిపించనున్నారు. ఇంతకు ముందు తన సినిమాల్లోనూ దర్శకుడిగా ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. ఇటీవల ‘గోలీసోడా 2’లో పోలీసు అధికారిగా తొలిసారి కనిపించి మెప్పించారు. ఆయన పాత్ర సినిమాను మలుపు తిప్పింది. ప్రస్తుతం ‘జై’ అనే కొత్త దర్శకుడి చిత్రంలో గౌతం హీరోగా నటించనున్నారు.

ఇటీవలే ఈ సినిమా కథను గౌతంకు జై వినిపించారట. చాలాసేపు ఆలోచించిన తర్వాత నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆగస్టు 15న చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ‘నాచ్చియార్‌’ ఫేమ్‌ నాయిక ఇవానా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గౌతంమేనన్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: