టాలీవుడ్, బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటివరకు క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎందరో నటీమణులు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి ప్రముఖులపై చేసిన ఆరోపణలు సంచనలం సృష్టించాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు, మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అంటున్నారు ప్రముఖ హీరో అర్జున్‌. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లిన అర్జున్‌ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రస్తావించారు.

‘చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని వస్తున్న వార్తలు నూటికి నూరుపాళ్లు నిజం. కానీ దానిని దృష్టిలో ఉంచుకుని నా కూతురు ఐశ్వర్యను సినిమాల్లోకి వెళ్లనివ్వకుండా ఆపలేదు. ఎందుకంటే నా కూతురిపై నాకు నమ్మకం ఉంది. ఇండస్ట్రీలో తను నెగ్గుకురాగలదు. ఆ నమ్మకంతోనే తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించాను. నేను ఇండస్ట్రీలో 38 ఏళ్లుగా పనిచేస్తున్నాను. అలాంటప్పుడు నేను కాకపోతే ఇండస్ట్రీని ఎవరు నమ్ముతారు’ అని వెల్లడించారు అర్జున్‌.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: