Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

తెలుగు, తమిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘కలర్స్‌’ స్వాతి. బుల్లితెరపై ‘కలర్స్‌’ కార్యక్రమం ద్వారా పరిచయమై డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, హీరోయిన్‌గా మారిన స్వాతి.. ఇప్పుడు శ్రీమతిగా మారింది. గత రాత్రి మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ జంట ఒక్కటయ్యింది. గురువారం (30 ఆగస్టు 2018) రాత్రి తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. సెప్టెంబర్‌ 2న కొచ్చిలో స్వాతి, వికాస్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

ఇండస్ట్రీకి చెందిన పెద్దలెవరూ లేకుండానే స్వాతి పెళ్లి చేసుకోవడం గమనార్హం. ‘అష్టాచమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాలతో స్వాతి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి వివాహానంతరం కూడా కథానాయికగా కెరీర్‌ని కొనసాగిస్తారని ఆమె సన్నిహితులు వెల్లడించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: