![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhp3whXV1AkvjWX14eLp4ZVNJ7qs5HLX0YImq3JXv0hG7jnyURgFH5UDQjLwKWDFoKOBl8Hd6XIZNokgDSD4WQGio_AYzdmT6pt4_RKM8xrKhGEkN9Gb2rVhiZnazQ0qNLRVVwP_Q8S/s1600/actor-amitabh-bachchan.jpg)
బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తొలిసారి తమిళ తెరపై అడుగు పెట్టనున్నారు. తమిళ్‌వాణన్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఓ తమిళ చిత్రంలో నటుడు ఎస్.జె.సూర్యతో కలిసి నటించనున్నారు. దీంతో అమితాబ్ వంటి గొప్ప నటుడిని తమిళ సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చిన ఘనత తమిళ్‌వాణన్ తన ఖాతాలో వేసుకున్నారు. తిరుచ్చెందూర్ మురుగన్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సురేష్ కన్నన్, ఫైవ్ ఎలిమెంట్స్ పిక్చర్స్ సంయుక్తంగా ‘ఉయరుంద మనిదన్’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది.
వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఇతర తారాగణం, సాంకేతిక కళాకారుల ఎంపిక పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఇదివరలో అమితాబ్ నటించిన రీమేక్ చిత్రాలు మాత్రమే తమిళంలోకి వచ్చాయి. ఆయన ప్రత్యక్షంగా తమిళ చిత్రంలో నటించడం ఇదే ప్రథమం.

Post A Comment: