Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. టీజర్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది.

‘‘చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పేర్కొంది.
రామోజీ ఫిలిం సిటీలో తారక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పదిహేను రోజులకి పైగా సాగే ఈ షెడ్యూల్‌ అనంతరం చిత్రీకరణ పొలాచ్చిలో జరగనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: