జీవనశైలి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. ప్రజల స్థితిగతులు, కుటుంబ బంధాలు.. పిల్లల అలవాట్లు...ఆయా దేశాల వాతావరణ పరిస్థితులతో పాటు అనుబంధాలు, ఆత్మీయతలను వివరించే యూరోపియన్ యూనియన్ సినిమాలు అందరిని ఆలోచింపజేస్తాయి. ఈ మేరకు ఆయా దేశాల్లో రూపుదిద్దుకున్న సినిమాలను ఒక వేదికపై ప్రదర్శింపజేసి, అన్ని వర్గాలను ఆలోచింపజేసే విధంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఫిలిం క్లబ్, సారథి స్టూడియో సంయుక్తంగా రాష్ట్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ సహకారంతో ఈ నెల 10 నుంచి 19 వరకు ఆయా దేశాలకు చెందిన సెన్సార్ బోర్డు ఆమోదించిన సినిమాలను ప్రదర్శించనున్నారు.
ఏ రోజు.. ఏ సినిమా..
23 దేశాలు.. 24 సినిమాలు
హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియో వేదికగా ప్రపంచంలోని 23 దేశాలకు సంబంధించిన డైరెక్టర్లు, నిర్మాతలు అద్భుతంగా రూపొందించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. 23వ యూరోపియన్ యూనియన్ చిత్రోత్సవంలో భాగంగా ప్రదర్శించే సినిమాలను ప్రేక్షకులు ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించారు. 18ఏళ్ల పైబడిన స్త్రీ, పురుషులు రోజూ ఈ చిత్రాలను చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఏ రోజు.. ఏ సినిమా..
- 10న సాయంత్రం 7.15గంటలకు పోలెండ్‌కు చెందిన ‘ఏ బేవ్ర్ బంచ్’, రాత్రి 8గంటలకు ఫిన్లాండ్‌కు చెందిన ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీ’.
- 11న సాయంత్రం 4గంటలకు డెన్మార్క్‌కు చెందిన ‘వాక్ విత్ మి’ 6గంటలకు లాట్వియాకు చెందిన ‘ది లెసన్’ ప్రదర్శిస్తారు. రాత్రి 8గంటలకు స్లోవేకియాకు చెందిన ‘లిటిల్ హార్బర్’.
- 12న సాయంత్రం 4గంటలకు స్పెయిన్‌కు చెందిన ‘ది బ్రైడ్’, 6గంటలకు హంగేరికి చెందిన ‘కిల్స్ ఆన్ వీల్స్’, రాత్రి 8గంటలకు ఇటలీకి చెందిన ‘టరంటా ఆన్‌ది రోడ్’.
- 13న సాయంత్రం 6గంటలకు బల్గేరియాకు చెందిన ‘విక్టోరియా’ 8గంటలకు బెల్జియంకు చెందిన ‘లాబ్రిన్‌థస్’ ప్రదర్శనలు ఉంటాయి.
- 14న సాయంత్రం 6గంటలకు జర్మనీకి చెందిన ‘హౌస్ వితౌట్ రూఫ్’ రాత్రి 8గంటలకు గ్రీన్‌కు చెందిన ‘కిస్సింగ్ ?’.
- 15న సాయంత్రం 4గంటలకు నెదర్లాండ్‌కు చెందిన ‘లెటర్ ఫర్ ద కింగ్’, సాయంత్రం 6గంటలకు లిధోనియాకు చెందిన ‘వెన్ యూ వేక్ అప్’, రాత్రి 8గంటలకు పోర్చుగల్‌కు చెందిన ‘మదర్ నోస్ బెస్ట్’ ప్రదర్శిస్తారు.
- 16న సాయంత్రం 4గంటలకు ఇస్టోనియాకు చెందిన ‘ది మ్యాన్ హు లుక్స్ లైక్ మి’, రాత్రి 8గంటలకు ఫ్రాన్స్‌కు చెందిన ‘నైన్ మంత్ స్ట్రెచ్’.
- 17న సాయంత్రం 6గంటలకు స్వీడన్‌కు చెందిన ‘ఎటర్నల్ సమ్మర్’ రాత్రి 8కి సైప్రస్‌కు చెందిన ‘బాయ్ ఆన్ ది బ్రిడ్జ్’.
- 18న సాయంత్రం 4కు కురేషియాకు చెందిన ‘కౌబాయ్స్’, 6గంటలకు డెన్మార్క్ చిత్రం ‘ల్యాండ్ ఆఫ్ మ్యాన్’, రాత్రి 8గంటలకు ఆస్ట్రేలియా చిత్రం ‘మ్యాజిక్ ఆఫ్ చిల్డ్రన్’ ఉంటాయి.
- 19న సాయంత్రం 4కు జేకీయాకు చెందిన ‘టైగర్ థియరీ’, సాయంత్రం 6గంటలకు లగ్జంబర్గ్‌కు చెందిన ‘ఎ వెడ్డింగ్’ సినిమాలు ప్రదర్శించనున్నారు.
23 దేశాలు.. 24 సినిమాలు
హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియో వేదికగా ప్రపంచంలోని 23 దేశాలకు సంబంధించిన డైరెక్టర్లు, నిర్మాతలు అద్భుతంగా రూపొందించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. 23వ యూరోపియన్ యూనియన్ చిత్రోత్సవంలో భాగంగా ప్రదర్శించే సినిమాలను ప్రేక్షకులు ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించారు. 18ఏళ్ల పైబడిన స్త్రీ, పురుషులు రోజూ ఈ చిత్రాలను చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Post A Comment: