Telugu Movie News | Latest Telugu Cinema News | Tollywood Film News | Tollywood News | All Cinema News | Cinerangam.com

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. టీజర్‌లో తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

రామోజీ ఫిలిం సిటీలో తారక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పదిహేను రోజులకి పైగా సాగే ఈ షెడ్యూల్‌ అనంతరం చిత్రీకరణ పొలాచ్చిలో జరగనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: