తమిళంలో ఇటీవల విడుదలై మంచి టాక్ అందుకున్న సినిమా ‘చతురంగ వేట్టై’. 'జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. నందితా శ్వేత కథానాయిక. దీన్ని తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాత. మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్థాలు జరుగుతాయి. అత్యాశపరులను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు నిర్మాతలు తెలిపారు.
‘బ్లఫ్ మాస్టర్’ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోపీ గణేశ్ దర్శకుడిగా నా కిష్టం. అతనితో నేనొక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాను. నాతో కలిసి పనిచేసిన నటులు సత్యదేవ్, ‘టెంపర్’ వంశీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ ఈ సినిమా కోసం పని చేశారు. ఈ కథ నాకు తెలుసు, చాలా బాగా ఉంటుంది. సీన్లు కూడా కొన్ని చూశా. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు నాకెప్పటి నుంచో స్నేహితుడు. ఆయన కూడా ఈ ప్రాజెక్టులో ఉండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’ అని అన్నారు.

Post A Comment: