పవర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాకి ముందుగా అనుకున్నట్లే ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌లో పవన్ సోఫాలో స్టైల్‌గా కూర్చుని కోపంగా చూస్తూ చేతిలో ఐడీ కార్డు తిప్పుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. రెండురోజుల నుంచే ‘పీఎస్‌పీకే 25 ఫస్ట్‌లుక్’ అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా తర్వాతి షెడ్యూల్ వారణాశిలో జరుగుతుండడంతో ఫస్ట్‌లుక్‌ను కూడా అక్కడే విడుదల చేశారు.
అసలైతే ఫస్ట్‌లుక్‌ను ఈరోజు 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫస్ట్‌లుక్ ఆలస్యమైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post A Comment: