బాలీవుడ్ నటుడు రిషి కపూర్.. దర్శకుడు అనురాగ్ బసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికపూర్ కుమారుడు.. రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జగ్గా జాసూస్’. ఇటీవల ఈ చిత్రం విడుదలైంది. అయితే సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దాంతో రిషి కపూర్ ఆ చిత్ర దర్శకుడు అనురాగ్ బసుపై మండిపడుతున్నారు.
‘అనురాగ్‌కి అసలు బాధ్యతలేదు. సినిమా విడుదలకి ఒక్క రోజు ముందు కూడా సినిమాలో ఏవో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ఏ దర్శకుడైనా ఇలా చేస్తాడా? అతనికి బాధ్యతలేదు కాబట్టే ఇతర నిర్మాతలు అతనితో కలిసి పనిచేయట్లేదు. సినిమా చేయాలనుకుంటాడు కానీ అనుకున్న సమయానికి పూర్తిచేయడు. రెండేళ్ల క్రితమే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీఅనురాగ్ ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఈ సినిమాకి మా అబ్బాయి కూడా నిర్మాతే. ఎంత గొప్ప దర్శకుడైనా ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఎవరూ అతనితో కలిసి పనిచేయాలని అనుకోరు. అదీకాకుండా సినిమాలో ప్రముఖ నటుడు గోవిందతో ఓ సన్నివేశం చిత్రీకరించారు. ఆ తర్వాత ఆసన్నివేశాన్ని కట్ చేసేశారు. అలాంటప్పుడు అతన్ని సినిమాలో తీసుకోవడం ఎందుకు? ఈ సినిమా విషయంలో నాకు రణ్‌బీర్‌కి చెడ్డపేరు వస్తోంది’ అని మండిపడ్డారు రిషి.
Post A Comment: