Telugu Movies Box Office News | Latest Telugu Cinemas Box Office News | Tollywood Films Box Office News | Tollywood Box Office News | All Cinemas Box Office News | Cinerangam.com

సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. ఈ ఏడాది టాలీవుడ్ ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ‘స్పైడర్’ ఒకటి. అందుకే ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో రికార్డ్ ధర పలికి బ్రహ్మాండమైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్న ఈ చిత్రం యొక్క తమిళ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దాదాపు రూ. 25 కోట్లకు ‘స్పైడర్‌’ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాన్ని కూడా లైకా సంస్థ పంపిణీ చేసింది. ఈ సంస్థపై రజనీకాంత్‌ ‘2.0’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సంస్థ చేతిలోకి ‘స్పైడర్’ సినిమా వెళ్లడం ద్వారా భారీ స్థాయి రిలీజ్, ప్రమోషన్లు దొరికి మంచి ఓపెనింగ్స్ దక్కనున్నాయి.

స్పైడర్‌’ చిత్రం సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తైంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి హ్యారిస్‌ జైరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: