మలయాళ నటి సాయిపల్లవి ‘ఫిదా’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన తొలి తెలుగు చిత్రంతోనే ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు. దీంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఆమె తెలుగులో మరో చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జంటగా సాయిపల్లవిని అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘మహానుభావుడు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మారుతీ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. ఆగస్టులో శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా ప్రారంభం కానుందట.
Post A Comment: