కన్నడ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బార్నా రమ్య పై ఓ సంచలన వార్త ఇప్పుడు హడావుడి చేస్తోంది. ఆమె ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకుందని పలు మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్యే జమీర్ బందువైనా ఫహద్ అలీ ఖాన్ అనే వ్యాపారవేత్తను రహస్యంగా 29 మే 2017న పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తుండడంతో శాండిల్ వుడ్ లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొంత కాలంగా ఆమె ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో కలిసిన వీరు అప్పటినుండి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని టాక్.
సోషల్ మీడియాలో వీరి వ్యవహారంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైలెంట్ గా ఉండే రమ్య ఇంత సైలెంట్ గా వివాహం చేసుకుంటుందని అనుకోలేదని అంటున్నారు. ఆమె ప్రస్తుతం 2 కన్నడ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది. మరి ఈ వార్త పై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. రమ్య 2008 లో వచ్చిన 'క్షుద్ర' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది.
Post A Comment: