Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com

శంకర్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘2.0’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రజనీ ఇటీవలే డబ్బింగ్‌ సైతం చెప్పేశారని కూడా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పా.రంజిత్‌ దర్శకత్వంలో నటించే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం విన్పిస్తోంది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ అందించిన మకుట సంస్థ ఈ సినిమా కోసం పనిచేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ముంబయిలోని ధారవి మురికివాడ నేపథ్యంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. సెట్స్‌ వేసి చిత్రీకరించేటప్పుడు అవి అత్యంత సహజంగా ఉండేందుకు వీఎఫ్‌ఎక్స్‌ సాయం తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని రంజిత్‌ భావిస్తున్నాడని అంటున్నారు. దీంతో గ్రాఫిక్స్‌ కోసం మకుట టీంను సంప్రదించినట్లు కోలీవుడ్‌ టాక్‌. రజనీ-పా.రంజిత్‌ కాంబినేషన్‌లో గతంలో ‘కబాలి’ రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తుడటం విశేషం. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు సమాచారం.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: