Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

ప్రముఖ బాలీవుడ్‌ నటి రీమా లగూ (59) కన్నుమూశారు. బాలీవుడ్‌లో అమ్మ పాత్రలకు వన్నె తెచ్చిన ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రీమా ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1970, 1980 దశకాల్లో రీమా బాలీవుడ్‌లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘మైనే ప్యార్‌ కియా’లో ఆమె సల్మాన్‌కు తల్గిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా వచ్చి ఇక్కడా విజయవంతమైంది. ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌, సాజన్‌, దిల్‌వాలే, కుచ్‌ కుచ్‌ హోతా హై, కల్‌ హో న హో, ఆక్రోశ్‌, ఆషిఖీ, హమ్‌ ఆప్కే హౌ కౌన్‌, దిల్‌ తేరా దివానా తదితర సినిమాల్లో నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో పలు ధారావాహికల్లోనూ నటించారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: