
తెలుగులో పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఇలా దాదాపు అందరు స్టార్ యువ కథానాయకులతో నటించి అభిమానులను సంపాదించకుంది ముద్దుగుమ్మ కాజల్. తేజ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన ‘లక్ష్మీకల్యాణం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఇటీవల చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన ‘ఖైదీ నెంబరు 150’లోనూ నటించిన సంగతి తెలిసిందే. ఇక ‘జనతాగ్యారేజ్’లో తొలిసారి ఐటమ్‌సాంగ్‌లో నర్తించి అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే తాజాగా ఆమె తొలి చిత్ర కథానాయకుడు కల్యాణ్‌రామ్ సరసన నటించబోతున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దాదాపు దశాబ్దం కాలం తర్వాత మళ్లీ వీరిద్దరి జంట కనువిందు చేయబోతోందన్నమాట. ప్రస్తుతం ఆమె తమిళంలో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోంది.
Post A Comment: