
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్‌రాజు భార్య అనితారెడ్డి (45) మృతి చెందారు. తాజాగా సినీ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో అనితారెడ్డి అస్వస్థతతో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దిల్‌రాజు నిర్మించిన కొన్ని చిత్రాలకు సమర్పకురాలిగా ఆమె వ్యవహరించారు. ఇన్నాళ్లు దిల్ రాజుగారి ప్రయాణంలో అడుగడునా ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన ఉన్నతికి తన వంతు భాద్యత నిర్వహించిన ఆమె మరణం ప్రతి ఒక్కర్ని కలచివేస్తోంది. మరోవైపు సినిమా పనులపై అమెరికాలో ఉన్న దిల్‌రాజు శనివారం అర్ధరాత్రికి స్వదేశం చేరుకొనే అవకాశాలున్నాయి. సోమవారం అనితారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పరిశ్రమలోని ఎంతో మంది నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణలకు అనేక విధాలుగా సహాయపడే మంచి మనిషి దిల్ రాజుగారికి, ఆయన కుటుంబానికి సినీరంగం.కామ్ ప్రగాఢ సంతాపం తెలుపుతోంది.
Post A Comment: