ర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2015 లో విడుదల చేసిన ‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రం కలెక్షన్ల వర్షంతో పాటు ప్రేక్షకుల మీద ఇప్పటికీ సమాధానం దొరకని ఒక చిక్కు ప్రశ్నని సంధించి వెళ్ళిపోయింది. ఈ ఒక్క ప్రశ్న ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ‘బాహుబలి 2’ కు కావాల్సినంత ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఉదాహరణకు ఎవరైనా ఒక సినీ ప్రేక్షకుడిని ‘బాహుబలి 2’ ఎందుకు చూడాలనుకుంటున్నారని అడిగితే... ఏమాత్రం ఆలోచించకుండా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికని సమాధానం చెప్తాడు.

అందుకే సినిమా ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న సందర్బంగా ఆ ప్రశ్నను ఇంకాస్త యాక్టివేట్ చేసి జనాల్లో ఉత్సాహం నింపడానికన్నట్టు రాజమౌళి తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశాడు. అందులో కట్టప్ప చిన్నప్పటి బాహుబలిని ఆడిస్తున్నట్టు ఒక స్టిల్, దాని కిందే యుద్ధంలో బాహుబలిని కట్టప్పే చంపుతున్నట్టు మరొక స్టిల్ ఉన్నాయి. ఆ పోస్టర్ చూస్తుంటే చిక్కు ప్రశ్న చిత్ర రూపం దాల్చి కళ్ళ ముందు ఆవిష్కృతమైనట్టు అనిపిస్తోంది. ఆ పోస్టర్ తో పాటే రాజమౌళి ‘కట్టప్ప పెంచిన బాలుడు.. కట్టప్ప చంపిన వ్యక్తి..’ అంటూ ఒక ట్వీట్ కూడా వేశాడు. దీంతో ప్రేక్షకుల్లో మరోసారి ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే చిక్కు ప్రశ్న నిద్రలేచింది. ఈ పశ్నకు సమాధానం తెలియాలంటే ఏప్రిల్‌ 28 వరకూ వేచి చూడాలి మరి.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: