వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు సాధించి కెరీర్లో మంచి స్థాయికి ఎదుగుతున్నటాలీవుడ్ హీరో నాని తండ్రి అయ్యారు. ఉగాది పర్వదినాన ఆయన సతీమణి అంజన మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పీఆర్వో మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ నాని, అంజన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంజన మగ శిశువుకు జన్మనిచ్చారట. ఆర్జేగా పనిచేసే రోజుల్లో నాని, అంజన ప్రేమించుకుని ఐదేళ్ల తర్వాత 2012 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఇటీవల తన తర్వాతి చిత్రం షూటింగ్ కోసం విదేశానికి వెళ్లి కొద్దిరోజుల క్రితమే తిరిగివచ్చారు. ప్రస్తుతం నాని నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నాని, అంజన దంపతులకు సినీరంగం.కామ్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
Congratulations to @NameisNani and @anjuyelavarthy for becoming proud parents today. A truly happy Ugadi for them 😀— Mahesh S Koneru (@smkoneru) March 29, 2017
Post A Comment: