వన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెసిందే. సినిమా చూసిన చాలా మంది శృతిహాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు బాగోలేదనే విమర్శలు చేశారు. ముఖ్యంగా విదేశాల్లో చిత్రీకరించిన రెండు పాటల్లో శృతి డ్రెస్సింగ్ స్టైల్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని, పైగా కాస్త ఇబ్బందిగా కూడా ఉందని విమర్శలు వచ్చాయి.

దీనిపై నిన్న (సోమవారం) జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు డాలీని వివరం కోరగా ఆయన కూడా ఈ ఫీడ్ బ్యాక్ ను తాము కూడా విన్నామని, శృతి కాస్ట్యూమ్స్ ను ముంబై బేస్డ్ డిజైనర్ రూపొందించారని, షూటింగ్ కు ముందు వాటిని చూసి తమకు కూడా పూర్తి సంతృప్తి కలుగలేదని, ఇక చివరి నిముషంలో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో చేసేది లేక వాటితోనే చిత్రీకరణ కానిచ్చేశామని అన్నారు. అలాగే శృతి హాసన్ ఎలాంటి లోటు చేయకుండా సినిమా కోసం కష్టపడ్డారని కూడా తెలియజేశారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: