ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా కిషోర్ పార్థ‌సాని(డాలీ) ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ చిత్రం లోకల్ ఏరియాలతో పాటు ఓవర్‌సీస్‌లో సైతం భారీ ధరకు అమ్ముడైంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ మీదున్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కుల్ని కొన్నారు. కొన్నవారి అంచనా ప్రకారం సినిమా మొదటి రోజునే సగం మొత్తం వెనక్కు రావాలి. కానీ ‘కాటమరాయుడు’ సినిమా ఆ అంచనాను అందుకోలేకపోయింది. పవన్ గత చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తో పోలిస్తే రాయుడు వసూలు చేసింది తక్కువే.

ఇక నిన్నటి వరకు లెక్కలు చూస్తే ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంటరైంది. అంటే దాదాపుగా రూ. 6 కోట్లు వసూలు చేసింది. సినిమాను కొన్నది రూ. 11. 5 కోట్లకు. దానికి ప్రచార హక్కుల్ని కూడా కలిపితే ఆ మొత్తం రూ. 12 కోట్లను చేరింది. రూ. 12 కోట్లలో వసూలైన రూ. 6 కోట్లు పక్కనబెడితే ఇంకో రూ. 6 కోట్లు వెనక్కు రావాలి. సినిమాలో కుటుంబ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ లేకపోవడం, ఆరంభంలోనే డివైడ్ టాక్ రావడం, రాబోయేవి వీక్ డేస్ కావడంతో ఈ చిత్రం అతి కష్టం మీద ఇంకో రూ. 1. 5 నుండి 2 కోట్ల వరకు రాబట్టవచ్చు. సో మొత్తం మీద చూస్తే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు తప్పేలా లేవు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: