క్కన్న రాజమౌళిని, సంగీత దర్శకుడు కీరవాణి తన అభిమానంతో ఏడిపించేశాడు. ఈ సంఘటన 'బాహుబలి: ది కంక్లూజన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చోటు చేసుకుంది. వేదికపై ప్రతి ఒక్కరూ రాజమౌళిని  ప్రపంచంలోని మేటి సినీ దర్శకుల్లో ఒకడని పొగుడుతుంటే, రాజమౌళి చిరునవ్వుతోనే సరిపెట్టాడు తప్ప.. ఎలాంటి భావోద్వేగానికీ లోను కాలేదు. అయితే, కీరవాణి అలా స్టేజ్‌ ఎక్కడం.. తన మీద పాట కట్టి, పాడేయడంతో రాజమౌళి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. కీరవాణి సర్‌ప్రైజ్‌కి.. రాజమౌళి కంటతడి పెడితే.. కాస్సేపు 'బాహుబలి ది కంక్లూజన్‌' ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రతి ఒక్కరిలోనూ ఉద్వేగం చోటుచేసుకుంది.

‘ఎవ్వడంట ఎవ్వడంట..? బాహుబలి తీసింది
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది
ఎవ్వరూ కనంది.. ఎక్కడా వినంది
శివుని ఆన అయ్యిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది
పెంచింది రాజనందిని.. కొండంత కన్న ప్రేమతో..
ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగు వాడిగా..!
చిరాయువై యశస్సుతో ఇలాగే సాగిపొమ్మని పెద్దన్న నోటి దీవెన శివుణ్ణి కోరు ప్రార్థన..’

అని ‘బాహుబలి’లో తను పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్‌ లిరిక్స్‌ మార్చి రాజమౌళిపై పాడి రాజమౌళిని స్టేజిమీదకు పిలిచారు. రాజమౌళి వస్తుంటే.. ‘పరుగెత్తుకు రా’ అన్నారు కీరవాణి. నిజంగానే రాజమౌళి పరుగెత్తుకు వెళ్లారు. అతిథులు, ఆహూతులు అందరూ గౌరవంగా లేచి చప్పట్లు కొట్టారు. రాజమౌళి కళ్లు చెమర్చాయి. పాట కొనసాగించారు కీరవాణి. ‘పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో.. ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగువాడిగా..’ అని పాడుతున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు రాజమౌళి. ‘చిరాయువై యశస్సుతో ఇలాగే సాగిపొమ్మని.. పెద్దన్న నోటి దీవెన శివుణ్ణి కోరు ప్రార్థన’ అని పాడుతూ సోదరుడ్ని ఆలింగనం చేసుకున్నారు. రాజమౌళి కన్నీరు తుడుచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళిపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించడంతో జక్కన్న భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.

‘‘తమ్ముడిని పొగడకూడదు. దీవించాలి. మళ్లీ మళ్లీ పైకి వస్తుండాలి. చాలా సంతోషంగా ఉంది. ఈ మహా కార్యక్రమంలో కొంచెం ఎక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నందుకు. ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అన్న ప్రశ్నలో వై ఉంది. అది ఉపయోగిస్తూ ‘వై కట్టప్ప కిల్డ్‌’ అనే ట్యూన్‌తో ట్రైలర్‌ చేద్దామని అనుకున్నా. అందులో వై ఒక్కటే చాలు అన్నాడు రాజమౌళి. వై ఒక్కటే ఏం సరిపోతుంది అన్నా. చాలు అలాగే చేద్దాం అన్నాడు. ఆ మొదటి అక్షరాన్నే ‘వై’ అంటూ గట్టిగా అరచి చెప్పా. ట్రైలర్‌ అలా వినిపించేది నా గొంతే. ట్రైలర్‌కి ఇంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ ‘వై’ అనేది ప్రశ్న కాదు.. హౌ అనేది ప్రశ్న. హౌ శోభు, ప్రసాద్‌గార్ల పెదాలమీద చిరునవ్వు మెయింటెన్‌ అయింది టెన్షన్‌ లేకుండా. రమ్యకృష్ణ జోకులు వేస్తూ మాట్లాడుతుంటారట. అలాంటి ఆమె శివగామి లాంటి పాత్ర ఎలా చేశారు? దేవసేన అద్భుతమైన శిల్పంలా నటించింది ఎలా? బయట చిన్నపిల్లలా ఉంటుంది. ప్రభాస్‌ గురించి ఒక ముక్క చెప్పాలి.

ప్రభాస్‌లో ఏముందో మీకు తెలుసు! ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్‌లో ఏం లేదు అంటే గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టయిల్‌ కొడుతూ ఉండాలి. ఫంక్షన్స్‌కు వెళితే ఇష్టం లేని వారిని ఇలా చూసి అలా ముఖం తిప్పుకుంటూ ఉండాలి. ఇలాంటి కంత్రీ పనులు చేస్తుంటారు. ఇలాంటివి ప్రభాస్‌కు అస్సలు చేతకాదు. ప్రభాస్‌కు మంచి మనసు ఉంది. దైవబలం ఉంది. నా భార్య 3గంటలకు లేచి వంట చేసి ఆర్‌ఎఫ్‌సీకి రావడం. తర్వాత రాత్రి 11గంటలకు ఇంటికి రావడం. అలా ఎలా కుదిరింది? ఆమె ఆరోగ్యం ఇప్పటికే పాడైపోయి ఉండాలి. ఎలా చేయగలిగిందనేది పెద్ద సందేహం.

జెమినిగారు, జీవన్‌, దినేష్‌లు చాలా కష్టపడ్డారు. రాజమౌళి బాగా ఎమోషనల్‌ అయ్యాడు. ఒక జోక్‌ చెబుతాను. ఒకసారి ఆర్‌ఎఫ్‌సీకి షూటింగ్‌ చూడటానికి వచ్చా. ఫైటర్స్‌ ఫొటో కావాలని అడిగారు. ఫొటో దిగాను. నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ని అని వారికి తెలియదు. వల్లీమేడమ్‌ భర్తగా నన్ను ఫొటో తీసుకున్నారట (నవ్వులు). ఇలాంటి అభిమానులు దొరికినందుకు సంతోషించా. రాఘవేంద్రరావు గారు నా గాడ్‌ఫాదర్‌. ఈ సినిమాలో మా నాన్నగారు, మా చిన్నాన్నకోడూరి రామకృష్ణ గారు ఒక పాట రాశారు. చైతన్యప్రసాద్‌ సోలోగా ఓ డ్యూయెట్‌ రాశారు’ అని కీరవాణి పేర్కొన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: