బాలకృష్ణతో చేస్తున్న సినిమాకు సంబంధించి కొద్ది కొద్దిగా క్లారిటీ ఇస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన పూరి... సినిమాలో హీరోయిన్ ముస్కాన్ అనే విషయాన్ని చూచాయగా చెప్పేశాడు. ఇప్పుడు టైటిల్ పై కూడా చిన్నపాటి క్లారిటీ ఇస్తున్నాడు. బాలయ్య కోసం పూరి ఓ వెరైటీ టైటిల్ పిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్య 101వ సినిమాకు 'ఉస్తాద్' అనే టైటిల్ ను పూరి జగన్నాథ్‌ ఫిక్స్ చేసినట్టు టాక్. సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే హీరోయిన్ ఎవరనే విషయంతో పాటు ఈ టైటిల్ ను కూడా గ్రాండ్ గా ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నాడట. ఏప్రిల్ మొదటివారంలో బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. సో.. అప్పట్లోగా హీరోయిన్లను, టైటిల్ ను ఫైనల్ చేయాలని పూరిజగన్నాధ్ కు బాలకృష్ణ టార్గెట్ ఫిక్స్ చేశాడట.

ప్రస్తుతం 'రోగ్' సినిమాకు ప్రచారం కల్పించే పనిలో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్‌, ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే.. బాలయ్య 101వ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇవ్వొచ్చు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: