ప్రముఖ నిర్మాత కేసి శేఖర్‌బాబు (73) శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగులో పలు చిత్రాలను నిర్మించారు. శుక్రవారం సాయంత్రం ఆయనకు గుండె పోటు రావడంతో హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ళ క్రితం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో సన్నిహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ముఠామేస్త్రి' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.ఆ చిత్రాన్ని నిర్మించింది శేఖర్ బాబు కావడం విశేషం.

1946 మే 1న కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో కేసీ శేఖర్‌బాబు జన్మించారు. అయన తండ్రి సినీ డిస్ట్రిబ్యూటర్ కావడంతో సినిమారంగంలోకి అడుగుపెట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ, జమున కాంబినేషన్‌లో వచ్చిన ‘మమత’ శేఖర్ బాబుకి నిర్మాతగా తొలి చిత్రం. ఆ తరువాత ఆయన 'సర్దార్', 'గోపాలరావుగారి అమ్మాయి', 'సంసారబంధం' వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన సినీపరిశ్రమ అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు. ఫిల్మ్ సెంట్రల్ బోర్డు చైర్మన్‌గా కూడా ఆయన పనిచేసారు. అయన మరణం సినిలోకాన్ని కలచివేసింది. చిరంజీవి మరియు ఇతర సినీప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలియజేసారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: