చారిత్రక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్, తన తదుపరి చిత్రాన్ని సీనియర్ హీరో వెంకటేష్ తో చేసేందుకు ప్లాన్ చేశాడు. 'గురు' సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ హీరోగా, డాక్టర్ కేశవ రెడ్డి రాసిన ‘అతడు అడవిని జయించాడు’ అనే ఓ సక్సెస్ ఫుల్ నవల ఆధారంగా ‘వీరయ్య’ పేరుతో సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు.

ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కూడా కావటంతో మరో లాండ్‌మార్క్ సినిమా చేసిన క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఇలా అర్దాంతరంగా ఆగిపోవటానికి కారణం… ‘అతడు అడవిని జయించాడు’ నవల విషయంలో కాపీ రైట్స్ ఇష్యూ అని చెప్తున్నారు.

ఈ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసిన క్రిష్, మరో స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. అదే సమయంలో ‘అతడు అడవిని జయించాడు’ నవల కాపీరైట్స్ ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే క్రిష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు ‘అతడు అడవిని జయించాడు’ నవల ఆధారంగా… బి.ఎస్.ఎన్. ఫిలింస్ పతాకంపై దూలం సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుందంటూ వార్తలు వచ్చాయి. పలు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ చిత్రం అంతర్జాతీయ సినిమా వేడుకల మీద పోటీపడేలా రూపొందిస్తున్నామని, ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపామని దర్శకుడు దూలం సత్యనారాయణ ప్రకటించారు.

తెలుగు సాహిత్యంలో విశిష్ట రచనగా గుర్తింపుపొందిన ఈ నవలకు అంతర్జాతీయ సినిమాగా రూపొందించే సత్తా వుందని, భారీ బడ్జెట్, అత్యాధునిక టెక్నాలజీతో ఆస్కార్, కాన్స్, లొకర్నో, బెర్లిన్, టోరంటో, బుసాన్ లాంటి అంతర్జాతీయ వేదికల పోటీలకు పంపనున్నట్లుగా ఆయన వివరించారు. పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించిన దూలం సత్యనారాయణకు ఇటీవల తెలంగాణ టూరిజంపై రూపొందించిన ఫిలింకు పోర్చుగల్‌లో ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: