టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసం ఈ రోజు ( శుక్రవారం) ఉదయం 9 గంటలకు టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. బన్నీ డిఫెరెంట్‌ గెటప్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయటంతో చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ముఖ్యంగా టీజర్ లో వచ్చిన ‘ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని’ అంటూ హీరోయిన్‌ ను ఉద్దేశించి బన్నీ పలికిన డైలాగ్‌ తెగ నచ్చేస్తోంది. ‘సరైనోడు’ బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: