హాశివరాత్రి సందర్భంగా ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’చిత్రానికి సంబంధించి మరో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ... ‘సాహోరే బాహుబలి... మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. హీరో ప్రభాస్‌ ఏనుగు తొండంపై వీరోచితంగా నిలబడి ఉన్న స్టిల్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి విజయఢంకా మోగించిన ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి 2’ని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా చిత్రాంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్‌ను మీరు ఇక్కడ చూడవచ్చు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: