న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో 50 కోట్ల మార్క్ ని చేరుకున్న బాలయ్య… తన పారితోషికం పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, 'గౌతమి పుత్ర శాతకర్ణి' అనంతరం నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగటం ఎక్కువైంది. అలాగే సీనియర్ దర్శకులు మాత్రమే కాకుండా యంగ్ డైరక్టర్స్ దృష్టి కూడా ఆయన మీద పడింది. ఆయనతో సినిమా చేసి హిట్ కొడితే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యిపోవచ్చనే నిర్ణయానికి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తన రెమ్యునేషన్ పెంచటంలో తప్పేమి లేదంటున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే ఆలోచనతో కాకుండా ఆయన తన పాత్ర, తన కథ, బ్యానర్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇన్నాళ్లూ నటుడుగా ముందుకు వెళ్తున్నారు. తొలిసారిగా ఆయన పారితోషికం గురించి మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఏడు కోట్లు తీసుకునే రెమ్యునేషన్ ని పది కోట్లకు పెంచారని చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్యని చూపించి బిజినెస్ చేసుకుందామనుకునే నిర్మాతలు, ఆ మాత్రం ఇవ్వటంలో తప్పేమి లేదంటున్నారు.

ఇక ప్రస్తుతం బాలయ్య దృష్టి అంతా ఆయన 101వ సినిమా పై పెట్టారు. ఈ సారి ఓ పక్కా మాస్ మసాలా మూవీ చేసేందుకు రెడీ అయిన బాలయ్య, తాజాగా ఓ ఫ్యాక్షన్ మూవీకి ఓకే చెప్పాడని టాక్. అలాగే ఈ చిత్రానికి తమిళ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా తమన్నాను, మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ను ఫిక్స్ చేస్తున్నారట.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: