హీరో విశాల్‌కు, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు మధ్య జరుగుతున్న వివాదానికి హైకోర్ట్ తన తీర్పుతో చెక్ పెట్టింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఫీల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో విశాల్ వివిధ స్థాయి పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ దక్షిణభారత నటీనటుల సంఘం మాత్రం విశాల్‌కు అలా వివిధ పదవుల్లో పోటీ చేసే అర్హత లేదని, కేవలం ఒక పదవిలో మాత్రమే పోటీ చేయడానికి వీలుంటుందని కండిషన్ పెట్టింది. ఈ మేరకు పోటీకి విశాల్ అర్హతలను సవాల్ చేస్తూ మద్రాస్ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు విశాల్ వివిధ పదవులకు పోటీ చెయ్యొచ్చని తీర్పు చెప్పింది. దీంతో విశాల్ వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు.
గత నవంబర్‌లో విశాల్ మీడియాతో కౌన్సిల్ గురించి పొరపాటుగా మాట్లాడారని ఆయన్నుకౌన్సిల్ సస్పెండ్ చేయగా, ఆ తర్వాత విశాల్ క్షమాపణ పత్రం సమర్పించడంతో కౌన్సిల్ అతని క్షమాపణను అంగీకరించింది.
Post A Comment: