కొన్ని కాంబినేషన్లు వినగానే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో రెండు పెద్ద క్యాంప్ లు నడుస్తున్నాయి. ఒకటి మెగా క్యాంప్ అయితే మరొకటి నందమూరి క్యాంప్. ఈ రెండు క్యాంప్‌లకు చెందిన అభిమానులు ఎప్పుడూ ఒకరిపై మరొకరు వాక్బాణాలు వేసుకుంటుంటారు. అలాగే సినిమాలు కూడా పోటా పోటీగా రిలీజ్ అవుతూంటాయి. అయితే రెండు క్యాంప్ లకు చెందిన హీరోలు మాత్రం తెర వెనక స్నేహంగానే ఉంటారు. అప్పటప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్‌లోనూ కలిసి కనబడుతుంటారు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే...

రామ్‌చరణ్ తేజ రీసెంట్‌గా నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి సినిమాగా ‘ఖైదీ నంబర్ 150’ తీసి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా సక్సెస్ ఎంజాయ్ చేస్తూండగానే… తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో మరో చిత్రం, అంటే 151 సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తానే నిర్మిస్తానని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత కూడా తన బ్యానర్ పై అఖిల్, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలతో చెర్రీ సినిమాలు తీయనున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం… కొణిదెల ప్రొడక్షన్ నెం.3, అంటే నిర్మాతగా చెర్రీ మూడో ప్రాజెక్టుని ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ అని చెప్తున్నారు. అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హాట్ కాంబినేషన్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్‌లనే కొణిదెల బ్యానర్ ఖాయం చేసిందనే టాక్ రావటంతో అందరూ ఆశ్చర్యంతో నిజమా అన్నట్లు చూస్తున్నారు. రామ్ చరణ్ – ఎన్టీఆర్‌లు క్లోజ్ ఫ్రెండ్స్.

త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మూవీకి రెడీ అవుతుండగా... ఎన్టీఆర్ కూడా బాబీ డైరెక్షన్లో తన కొత్త సినిమాను స్టార్ట్ చేసారు. సెప్టెంబర్ నుంచి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: