2017 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప ఆరంభాన్ని అందించింది. విడుదలైన మూడు చిత్రాలు ‘ఖైదీ నెంబర్ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానంభవతి’ భారీ విజయాలుగా నిలిచి పెద్ద మొత్తంలో లాభాల పంట పండించాయి. ఈ మూడింటిలో ‘శతమానంభవతి’ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రెండు పెద్ద హీరోల చిత్రాలు రిలీజై హిట్ టాక్ తెచ్చుకునప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా విడుదలైన ఈ చిత్రం, వాటితో పాటే సంక్రాంతి విజయాన్ని పంచుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇదే హిట్ కాంబో రిపీట్ కానుందట. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాత దిల్ రాజుతో కలిసి మరొక సినిమా చేయనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా 'శతమానంభవతి' తరహాలోనే పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని, దీనికి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక సమాచారం, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: