మంచి టాక్‌తో ఈ నెల 17న విడుదలై ప్రేక్షకులు, విమర్శకులు, సినీ పెద్దల నుండి ప్రసంశలందుకుంటున్న ‘ఘాజీ’ చిత్రం, బాక్స్ ఆఫీస్ దగ్గరా సత్తా చూపుతోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విడుదలైన మొదటి రోజు, అంటే శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూ. 4.25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం వారాంతం శనివారం మరింత పుంజుకుని రూ. 5. 25 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజులకు కలిపి మొత్తం రూ. 9.50 కోట్ల కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ వెర్షన్లో రెండు రోజుల్లో రూ. 3.90 కోట్లు దక్కించుకోవడం విశేషం. అలాగే ఓవర్‌సీస్‌లో సైతం బాగానే ప్రభావం చూపుతోంది. మొదటి రోజు $141,291 కలెక్ట్ చేసింది. ఇక వచ్చే శుక్రవారం వరకు కొత్త సినిమా రిలీజ్ లేకపోవడం, ఉన్న వాటిలో ఈ చిత్రమే కాస్త స్పెషల్ గా కనిపిస్తుండటంతో వసూళ్లు స్టడీగా రన్ అయ్యే ఛాన్సుంది.

పివిపి, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సబ్ మెరైన్ డ్రామా చిత్రంకు నూతన దర్శకుడు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: