చయితగా 'మంత్ర', 'మంగళ' మొదలైన పది చిత్రాలకు రచయితగా పనిచేసిన సూర్య ఎం.ఎస్.ఎన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'సువర్ణ సుందరి' అనే తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రాన్నిగురువారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సినిమా వివరాలను తెలియజేశారు. "ఈ సినిమా సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అక్కినేని గారి పాత 'సువర్ణ సుందరి' సినిమా కథకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్ర కథ 15 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కాలం నుంచి మొదలై మూడు తరాల కథగా సాగుతుంది. ఇందులో 15 నిమిషాలు పాటు గ్రాఫిక్స్ వుంటాయి. ప్రత్యేకంగా నిర్మించిన అండర్ వాటర్ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తాం. 6 కోట్ల బడ్జెట్ తో 75 రోజులపాటు బీదర్, బెంగళూరు, కేరళ మరియు హైదరాబాద్ లలో షూటింగ్ చేస్తాం." అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సాయి కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు ఛాలెంజ్ లాంటిదని. శతాబ్దాల కిందటి ఫీల్ తీసుకు రావడానికి లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నట్లు చెప్పారు. ఇంద్ర, రామ్, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: