Hollywood Movie News | Latest Hollywood Cinema News | Hollywood Film News | Hollywood News | All Cinema News | Cinerangam.com

91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలో ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా సందడి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి పురస్కార ప్రదానోత్సవం ప్రారంభమైంది. పీటర్ ఫర్రెల్లి దర్శకత్వం వహించిన 'గ్రీన్ బుక్' చిత్రం ఉత్తమ చిత్రం అవార్డ్ గెలుచుకోగా.. ‘బ్లాక్ పాంథర్‌’, ‘రోమా’ చిత్రాలకు అవార్డుల పంటపండింది.

విజేతల వివరాలు..

ఉత్తమ చిత్రం - గ్రీన్‌ బుక్‌
ఉత్తమ దర్శకుడు - ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)
ఉత్తమ నటుడు - రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)
ఉత్తమ నటి - ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)
ఉత్తమ సహాయ నటి - రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)
ఉత్తమ సహాయ నటుడు - మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)​​​​​​​
ఉత్తమ ఛాయాగ్రాహకుడు - అల్ఫాన్సో కరోన్‌(రోమా)
ఉత్తమ విదేశీ చిత్రం - రోమా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం - ఫ్రీ సోలో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం - పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - బ్లాక్‌ పాంథర్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)
ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌ - బొహెమియన్‌ రాప్సోడి
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - స్పైడర్‌ మ్యాన్‌: ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: