Indian Movie News | Latest Indian Cinema News | Indian Film News | Oscar Awards 2019 News | All Cinema News | Cinerangam.com

మెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా నిర్మించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ లభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు.

25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ న్యాప్‌కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారు అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. ఆస్కార్‌ అవార్డును అందుకున్న సందర్భంగా ఈ చిత్ర దర్శకురాలు రేకా స్టేజ్‌పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్‌. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటికీ.. అవార్డుల విషయానికి వచ్చేసరికి చాలా సార్లు నిరాశనే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాత గునీత్‌ మోంగా ట్వీట్‌ చేస్తూ.. ‘మనం గెలిచాం. ఈ భూమ్మీదున్న ప్రతీ ఆడపిల్ల తనని తాను ఓ దేవతలా భావించాలి’ అని పేర్కొన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: