Hindi Movie Gossips | Latest Hindi Cinema Gossips | Bollywood Film Gossips | Bollywood Gossips | All Cinema Gossips | Cinerangam.com

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ నిజ జీవిత కథలో నటించబోతోంది. దర్శకురాలు సోనాలీ బోస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’లో కీలక పాత్రధారి జైరా వాసీమ్‌కు తల్లి పాత్రలో ప్రియాంక కనిపించనుంది. ఈ చిత్రంలో ప్రియాంకకు జోడీగా అభిషేక్‌బచ్చన్‌ను అనుకొన్నారు. కానీ చివర్లో అభిషేక్‌ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి ఫర్హాన్‌ అక్తర్‌ వచ్చాడు. ‘దిల్‌ దడక్‌నే దో’ తర్వాత ప్రియాంక, ఫర్హాన్‌ అక్తర్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో జైరాకు తల్లిదండ్రులుగా నటించనున్నారు ప్రియాంక, ఫర్హాన్‌.

పల్మనరీ ఫైబ్రోసిస్‌’ వ్యాధితో 18 ఏళ్లకే చనిపోయిన అయేషా చౌదరి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తనకు ఆ వ్యాధి ఉందని 13 ఏళ్ల వయసులో తెలిసినా ధైర్యం కోల్పోకుండా ఓ ప్రవక్తలా మారి అందరికీ స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు చేసింది అయేషా. ‘మై లిటిల్‌ ఎపిఫనీస్‌’ అనే పేరుతో పాజిటివ్‌గా బతకడం గురించి ఓ పుస్తకం కూడా రాసింది. ఆగస్టులో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: