Hindi Movie News | Latest Hindi Cinema News | Bollywood Film News | Bollywood News | All Cinema News | Cinerangam.com

తిలోక సుందరి శ్రీదేవిని మళ్లీ వెండితెరపై చూసే అవకాశం కలగనుంది. షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జీరో’. అందులో ఆమె తన నిజ జీవిత పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఇందులో శ్రీదేవి ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ‘జీరో’లోని ఓ ప్రత్యేక గీతంలో పలువురు బాలీవుడ్‌ కథానాయికలు కనిపించనున్నారు. ఆ పాటలోనే శ్రీదేవి మెరవనున్నారట. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ సన్నిహితులు ధ్రువీకరించారట.

అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 21న విడుదల కానుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు శ్రీదేవి మన మధ్యలో లేకపోయినా తెరపై చూసే అవకాశం కలగనుంది. శ్రీదేవి తెరపై కనిపించిన ఆఖరి చిత్రం ఇదే కానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: