కథానాయిక రష్మిక మందన 'గీత గోవిందం' చిత్రం ద్వారా తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నారు. కొన్ని రోజుల క్రితం రష్మికకు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే ఇటీవల ఈ నిశ్చితార్థం రద్దయినట్లు ఆమె తల్లి సుమన్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై రక్షిత్ సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. రష్మికను ఎవ్వరూ టార్గెట్ చేయొద్దని, ఆమెకు ప్రశాంతత కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘అభిమానులారా.. ఇతర విషయాల కారణంగా కొంతకాలం పాటు నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాను. కానీ పలు అంశాలపై క్లారిటీ ఇవ్వడానికి ఫేస్‌బుక్ ఖాతా తెరవాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. మీరంతా రష్మిక గురించి ఏవేవో అభిప్రాయాలు అనుకున్నారు. ఈ విషయంలో మిమ్మల్ని వేలెత్తి చూపలేను. ఎందుకంటే అది అలా జరిగిపోయింది. మనం కళ్లతో చూసిన విషయాలనే నమ్ముతాం. ఒక్కోసారి మనం చూసేవి కూడా నిజం కాకపోవచ్చు. మరోవైపు నుంచి ఆలోచించకుండా ఓ నిర్ణయానికి వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండేళ్లుగా తెలుసు. మీకంటే ఆమె గురించి నాకే బాగా తెలుసు. ఆమెను టార్గెట్ చేయకండి. ప్రశాంతంగా ఉండనివ్వండి. త్వరలో అన్ని నిజాలు బయటికి వచ్చి అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నా. మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు. అవసరాల కోసం ఎవరికి వారు వార్తలు సృష్టిస్తున్నారు. ఊహాగానాలు నిజాలు కావు. ఈ సందేశం అందరికీ అందాలని నా ఫేస్‌బుక్ పేజ్‌ను తెరిచే ఉంచుతాను. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల అవసరం నాకుంది అనుకున్నప్పుడు మళ్లీ వస్తాను. నేను సోషల్‌మీడియాకు దూరంగా ఉండటానికి, రష్మికకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోతున్నాను. అలా కాకుండా ఇక నుంచి కేవలం పని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. మీ రక్షిత్’ అని పేర్కొన్నారు.

Post A Comment: