సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘2.0’. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయకచవితి సందర్భంగా ‘2.0’ 3డీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది. గతంలో ఏ భారతీయ చిత్రమూ తెరకెక్కించని రీతిలో శంకర్ ‘2.0’ను తీర్చిదిద్దారు. సినిమా మొత్తాన్ని 3డీ కెమెరాలతోనే తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్‌ను థియేటర్‌లలో ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు.
ఈ చిత్రం యొక్క 3డీ టీజర్‌ను చూడాలనుకునేవారు దగ్గర్లోని పీవీఆర్, సత్యం థియేటర్స్‌లో చూడవచ్చట. ఇందుకోసం 90999 49466కు మిస్డ్‌కాల్ ఇచ్చి ఉచిత టికెట్‌ను బుక్ చేసుకోవాల్సిందిగా చిత్ర బృందం అభిమానులను కోరుతోంది. అలా ఉచిత టికెట్ పొందిన వారు వినాయకచవితి రోజున 3డీ టీజర్‌ను చూడవచ్చు.
ఇటీవల దర్శకుడు శంకర్ ఈ సినిమా గురించి చెబుతూ.. ప్రపంచ వ్యాప్తంగా 3000 మందికిపైగా టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పారు. అంతేకాదు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.543 కోట్లు) బడ్జెట్‌తో వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ ఉపయోగించి తీస్తున్న తొలి భారతీయ చిత్రమిదని పేర్కొన్నారు. మరి శంకర్ చేసిన మేజికేంటో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే!
Post A Comment: